కాశీ నుంచి వచ్చిన 24 మందికి నో కరోనా

by Shyam |

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్​లో ఉన్న 26 మందిలో 24 మందికి కరోనా నెగెటివ్​ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. వీరంతా కాశీ యాత్రకు వెళ్లివచ్చినట్లుగా చెప్పారు. మిగిలిన ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ఇందులో భువనగిరి పట్టణానికి చెందిన ఒకరు, చౌటుప్పల్​కు చెందిన మరొకరి నివేదికలు రావాల్సి ఉందని వివరించారు. మర్కజ్ ఘటనకు సంబంధించిన వారితోపాటు, పొరుగు జిల్లాలకు వెళ్లి వచ్చిన 390 మంది హోం క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు.

Tags;Nalgonda,Yadadri,BB nagar Aiims,24 corona negative

Advertisement

Next Story