రేషన్ కార్డుల పంపిణీలో రచ్చ.. రచ్చ.. బీజేపీ కార్పొరేటర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వ విప్

by Anukaran |   ( Updated:2021-07-26 06:54:13.0  )
రేషన్ కార్డుల పంపిణీలో రచ్చ.. రచ్చ.. బీజేపీ కార్పొరేటర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వ విప్
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లో నిర్వహించిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభసగా మారింది. ప్రభుత్వ విప్ గాంధీతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు హాజరైన ఈ కార్యక్రమానికి స్థానిక గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి వెళ్లి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం తనను ఎందుకు పిలవలేదని, కనీసం సమాచారం ఇవ్వలేదని సంబంధిత ఏఎస్ఓను నిలదీశారు.

ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు అంటే చిన్నచూపు ఎందుకని వారు ప్రశ్నించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ శ్రేణులను శాంతింపజేశారు. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తానని ఏఎస్ఓ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చి రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఐటీ సెల్ ప్రెసిడెంట్ రాహుల్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నరేంద్ర ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, శేరిలింగంపల్లి మహిళా మోర్చా కన్వీనర్ పద్మ, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story