కాంగ్రెస్‌కు మళ్లీ పంచ్… బీజేపీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు

by Shamantha N |   ( Updated:2020-08-19 08:44:40.0  )
కాంగ్రెస్‌కు మళ్లీ పంచ్… బీజేపీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, దేశంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. రాజస్థాన్ సంక్షోభం నుంచి కాంగ్రెస్‌ పార్టీ గట్టెక్కి… వారం అయిందో లేదో అంతలోనే మరో కోలుకోలేని దెబ్బ పడింది. ఇటీవల మణిపూర్‌లో కాంగ్రెస్‌‌కు రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన వారిలో మణిపూర్ సీఎల్పీ నాయకుడు ఓక్రామ్ ఇబోబి సింగ్ మేనల్లుడు ఓక్రామ్ హెన్రీ సింగ్ కూడా ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారంతా కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మణిపూర్‌లోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల బలపరీక్ష నుంచి గట్టెక్కింది.

Advertisement

Next Story