- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీలకు పక్కా బిల్డింగ్‌లేవీ?
దిశ, మహబూబ్‌నగర్: గ్రామాల సాధికారతే లక్ష్యమని చెబుతున్న సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను గ్రామపంచాయితీలుగా చేయడంతో ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1,692 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీల ఏర్పాటుతో నార్మల్ పీపుల్స్‌ను ఖుష్ చేసినా.. సర్పంచ్‌లు సమావేశాలు పెట్టుకునేందుకు బిల్డింగ్‌లు ఏర్పాటు చేయలేదు. దీంతో సర్పంచ్‌లు తమ ఇళ్ల వద్దనే సమస్యలపై చర్చిస్తుండగా మరికొందరు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు.
గతంలో ఉన్న పంచాయితీ భవనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. పాత భవనాల్లో పెచ్చులు ఊడుతుండటంతో సర్పంచ్‌లతో పాటు సంబంధిత అధికారులు కూడా జంకుతున్నారు. ఏ సమయంలో పెచ్చులు ఊడి మీద పడతాయో అన్న భయంతో పాలన కొనసాగిస్తున్నారు. చాలా వరకు భవనాల్లో పంచాయితీల్లో ఒకటి, రెండు గదులే ఉండటంతో ఒకే సమయంలో సర్పంచ్‌లు, అధికారులు కూర్చొని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. భవనాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రస్తుతం పాలన సాగిస్తున వారికి శాపంగా మారింది. మొత్తం గ్రామానికి మరుగుదొడ్లను మంజూరు చేసే గ్రామ పంచాయితీకే మరుగుదొడ్లు లేక ఇబ్బందులు వస్తున్నాయి. మహిళా సర్పంచ్‌లు, వీఆర్వోలు, వీఆర్ఎలు ఉన్న చోట పరిస్థితి చెప్పలేని విధంగా ఉన్నాయని వాపోతున్నారు.
ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లా గణాంకాల ప్రకారం మొత్తం 440 గ్రామ పంచాయితీలు ఉంటే 247 పంచాయితీలకే సొంత బిల్డింగ్‌లు ఉన్నాయి. మిగతా 193 పంచాయితీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేని పంచాయితీలు సుమారు 350పై చిలుకు ఉండటం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,692 పంచాయితీలలో సుమారు 870 పంచాయితీలకు సొంత భవనాలు లేవు. పంచాయితీల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన కోసం పలు మార్లు పంచాయితీ అధికారులకు విన్నవించినా స్పందన లేదని సర్పంచ్‌లు అంటున్నారు. ముఖ్యమైన సమావేశాలు, ఉన్నతాధికారులు గ్రామాల పర్యటనలకు వచ్చే టైంలో స్కూళ్లకు అనధికారికంగా సెలవులు ఇవాల్సి వస్తుంది. దీంతో విద్యార్థుల చదువులు కూడా ఇబ్బందుల్లోకి నెట్టబడుతుంది కాబట్టి పంచాయితీ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.
Tags: Mahabubnagar, Panchayat Offices, Rent buildings, Sarpanch, Tandas, TS News