- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ మై గాడ్.. సైడ్ ప్లీజ్
దిశ, హైదరాబాద్ బ్యూరో
నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్ల వెడల్పు, ఫ్లైఓవర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే, రోడ్ల మధ్యలో, విస్తరణ ప్రాంతాల్లో అడ్డుగా ఉన్న వివిధ ప్రార్థనా మందిరాలు ట్రాఫిక్‌ను మరింత పెంచుతున్నాయి. కొత్తగా వచ్చిన మెట్రో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుందనుకుంటే… పలు ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు, మెట్రో లైన్లు కలిసి సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఉన్నత న్యాయ స్థానాలు ఆదేశాలిస్తున్నా ప్రార్థనాలయాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడం లేదు. మరో వైపు మత పరమైన ఓటు బ్యాంకు కోసం అధికార పార్టీ కూడా సమస్యను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 60 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటికి తోడు ప్రతి రోజూ 1000 వరకు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. రోడ్లు మాత్రం వాహనాలకు అవసరమైన స్థాయిలో విస్తరించడం లేదు. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. సిటిలో ప్రధాన రో్డ్లలోని మతపరమైన కట్టడాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మత కట్టడాలను తొలగిస్తామని సుమారు ఐదేండ్ల క్రితమే జీహెచ్ఎంసీ హైకోర్టుకు చెప్పింది. సిటిలో ఉన్న 357 రోడ్లలో 647 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని బల్దియా అధికారులు గుర్తించారు. గుళ్లు, మజీద్‌లు, చర్చీలతో పాటు ఇతర ప్రార్థనా మందిరాలు 533 ఉన్నాయి. దర్గాలు, గ్రేవ్ యార్డులు మరో 144 వరకు ఉన్నాయి. వీటిని దశల వారీగా తొలగించి ట్రాఫిక్ సమస్యలను తొలగిస్తామని హైకోర్టుకు బల్దియా అధికారులు తెలిపారు. మొదటి దశలో 25, రెండో దశలో 86, మూడో దశలో 510 నిర్మాణాలను తొలగిస్తామని ప్రకటించారు. గతంలో కొన్ని మత సంస్థలకు నోటీసులు ఇచ్చినా తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఇప్పుడు రోడ్డు విస్తరణలు, ఫ్లైఓవర్లు వేయాలంటే సమస్యగా మారింది. గతంలో చిన్నగా ఉన్న మందిరాలు ఇప్పుడు మరింత విస్తరించబడ్డాయి. దీంతో అవి అనేక చోట్ల రోడ్ల మీదకే వచ్చేశాయి. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు.
ప్రధాన రోడ్లలో 72కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల్లో 90 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. చాలా సున్నితమైన సమస్య కావడంతో ఒక్క ప్రార్థనాలయాన్ని కూడా కనీసం జరపకుండానే ప్రాజెక్టును పూర్తిచేశారు. రోడ్డు మధ్యలోనే ప్రార్థనా మందిరాలను వదిలేసి తమ పనులు కానిచ్చేశారు. టోలిచౌకి ఫ్లై ఓవర్ నిర్మాణం వద్ద రోడ్డు మద్యలో రెండు వర్గాలకు చెందిన ప్రార్థన మందిరాలు ఉండటంతో ప్లై ఓవర్‌ను రెండుగా విభజించి నిర్మాణం చేపట్టారు. సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నేతలు వీటిని పెంచి పోషిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులతో పాటు మూసీలోని అనేక ప్రాంతాల్లో మందిరాలు పోటీపడి ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు పేరుతో లీడర్లుగా చలామణి అవడం, వారికి రాజకీయ నేతల అండ ఉండటంతో అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారు.
గ్రేటర్‌లోని పలు రహదారులపై ప్రధాన మతాలకు సంబంధించి ప్రార్థనా మందిరాలు మెజారిటీగా ఉన్నాయి. వీటిల్లో ఏ నిర్మాణాన్ని ముట్టుకున్న ఆ మతం ఓటు బ్యాంకు నష్టపోతామనే భయం అధికార పార్టీలో కనబడుతోంది. కేసీఆర్ గతంలోనే హిందూ – బొందు వ్యాఖ్యలు చేయడం వంటివి ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేని స్థితిలో ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా ఇబ్బందుల పాలయ్యేది మాత్రం సామాన్య ప్రజలే.. పాలకులు రాజకీయాలకోసం కాకుండా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని గ్రేటర్ ప్రజలు కోరుతున్నారు