- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. డీసీసీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
దిశ, గుడిహత్నూర్: కాంగ్రెస్‌తోనే యువతకు ఉద్యోగాలు, భవిష్యత్తు ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. యువత చూపు కాంగ్రెస్ వైపు ఉందని అందుకే జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బుధవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో దాదాపు 200 మంది యువకులు కాంగ్రెస్‌లో చేశారు. వారికి సాజిద్ ఖాన్, మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి హస్తం గుర్తు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యకం చేశారు.
అనంతరం మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రుల వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని ‘‘దోచుకో-దాచుకో’’ అన్న తరహాలో పాలిస్తున్నారని అన్నారు. జిల్లాకు నిధులు తేవడంలో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. జిల్లాకు సాగు, తాగు నీటిలో అన్యాయం జరుగుతున్నా.. ఇక్కడి ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. ఇక్కడి గిరిజన యునివర్సిటీని పక్క జిల్లాకు తరలించి విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగ్ రావ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావ్ పాటిల్, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీధర్, భూపెళ్లి మండల అధ్యక్షులు కరుణాకర్, మల్యాల మండల కార్యనిర్వాహక అధ్యక్షులు షాహిద్, ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమూద్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి చంటి, జిల్లా కార్యదర్శి భీమన్న, నాయకులు నాగనాథ్, మాధవ్, షేక్ కలీమ్, రాజు యాదవ్, పలు మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.