రెండంకెల వృద్ధి సాధించగల ఏకైక దేశం భారత్

by Harish |   ( Updated:2021-01-26 10:23:38.0  )
రెండంకెల వృద్ధి సాధించగల ఏకైక దేశం భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతం వృద్ధితో భారత ఆర్థికవ్యవస్థ బలంగా పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఈ ఏడాది ప్రపంచ పునరుద్ధరణ నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వచ్చే ఏడాది రెండంకెల వృద్ధి చెందగల ఏకైక ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని, అంతేకాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 6.8 శాతం వృద్ధిని కొనసాగిస్తుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

కరోనా వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ అప్‌డేట్‌లో పేర్కొంది. ఇదివరకు దేశ జీడీపీ వృద్ధిని 10.3 శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. దీన్ని 8 శాతం క్షీణతగా సవరిస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ 2021లో 5.5 శాతం, 2022లో 4.2 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఎంఎఫ్ వెల్లడించింది.

Advertisement

Next Story