- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం : IMD
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం లేదా అంతకంటే అధిక వర్షపాతం పడనుందని భారత వాతావరణ శాఖ మంగళవారం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు ఒకే రీతిలో వర్షపాతం నమోదు కానున్నట్టు తెలిపింది. రెండో లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్(ఎల్ఆర్ఎఫ్) అంచనాలను విడుదల చేస్తూ ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా వివరించారు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని గురువారం తాకనున్నట్టు అంచనా వేశారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతంపై ఏప్రిల్‌లో విడుదల చేసిన అంచనాలను మంగళవారం మరోసారి సవరించారు. ఈ ఏడాది ఎల్ఆర్ఎఫ్ 101శాతంగా అంచనా వేశారు. పాత అంచనాల ప్రకారం ఇది 98శాతంగా ఉన్నది. ఖరీఫ్ సీజన్‌కు కీలకమైన జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో 70శాతం వర్షాలు పడనున్నట్టు మోహపాత్రా వెల్లడించారు. వాయవ్య, మధ్య, దక్షిణ భారతంలో సాధారణం లేదా అంతకు మించి వర్షపాతం నమోదు అవుతాయని, తూర్పు, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడే అవకాశముందని వివరించారు.