ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయంపై ఐఎంఏ అభ్యంతరం

by Shamantha N |
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయంపై  ఐఎంఏ అభ్యంతరం
X

డెహ్రాడూన్: అల్లోపతి- ఆయుర్వేదం మధ్య జరుగుతున్న వాదవివాదాలను జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయం కొత్త మలుపు తిప్పింది. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి(ఆధునిక వైద్య ఔషధాలు) మందులు రాయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. డెహ్రాడూన్‌లోని ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ఆయుష్ మంత్రి హరాక్ సింగ్ రావత్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్ర మారుమూల ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువగా ఆయుర్వేద వైద్యులే ఉన్నారని, ఈ నిర్ణయంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు లబ్ది పొందుతారని వివరించారు. ‘రాష్ట్రంలో 800 ఆయుర్వేద వైద్యులున్నారు.

మొత్తం ఆయుర్వేద కేంద్రాల్లో 90 శాతం కొండప్రాంతాల్లోనే ఉన్నాయి. కాబట్టి, ఆయుర్వేద వైద్యులకు అల్లోపతి మెడిసిన్స్‌ను ప్రిస్క్రయిబ్ చేయడానికి అనుమతిస్తే అంతిమంగా ప్రజలే లబ్ది పొందుతారు’ అని తెలిపారు. ఈ నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర విభాగం మండిపడింది. ఇది చట్టవ్యతిరేకమని, మిక్సోపతి అని ఆరోపించింది. మిక్సోపతితో ఎమర్జెన్సీకాలంలో పేషెంట్లకు నష్టమే జరిగే ముప్పు ఉంటుందని ఐఎంఏ రాష్ట్ర సెక్రెటరీ అజయ్ ఖన్నా వివరించారు. అల్లోపతి గురించి తెలియకుండా ఆ మందులను ఆయుర్వేద వైద్యులు ఎలా సూచిస్తారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed