- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబు ఇంట్లో పాచి పనిచేస్తానంటున్న ఏపీ డిప్యూటీ సీఎం.. ఎందుకంటే ?
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, నారా లోకేశ్‌లు ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచినా చంద్రబాబు ఇంట్లో పాచిపని చేసేందుకు సిద్ధమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు తనను కూడా టీడీపీలోకి లాక్కునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
ఎంతోమందితో బేరాలు ఆడించారని చెప్పుకొచ్చారు. అయితే తాను లొంగలేదని చెప్పుకొచ్చారు. డబ్బుకు, పదవులకు తాను లొంగే వ్యక్తిని కాదని ఆనాడే తాను చంద్రబాబుకు నిరూపించినట్లు చెప్పుకొచ్చారు. తాను అవినీతికి పాల్పడ్డానంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుందని అది నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నవాళ్ల కోసం తపన పడతారని.. కానీ సీఎం జగన్ పేదల గురించి ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అడ్డగోలుగా కొనుగోలు చేశారని..వారిలో రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారే తప్ప ఒక్క ఎస్సీకి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అంతేకాదు చంద్రబాబు తన హయాంలో ఎస్సీలకు న్యాయం చేయకపోగా.. అహహేళన చేసేవారని చెప్పుకొచ్చారు. అందువల్ల చంద్రబాబుకు ఎస్సీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.