- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వికటించిన మధ్యాహ్న భోజనం.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని దామరాంచ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో భయాందోళన చెందిన ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన 15మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిసి బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తరుచూ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీలు చేస్తున్నా.. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న బాన్సువాడ నియోజకవర్గంలో గత నెలరోజులుగా నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనలకు కారణమని అంటున్నారు.
Advertisement
Next Story