- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్జాగా రోడ్డెక్కిన రేషన్ బియ్యం.. 25kgs సీజ్
దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో దర్జాగా రేషన్ దందా కొనసాగుతుంది. నగరంలోని శివారు ప్రాంతాలను స్థావరాలుగా చేసుకొని ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. నేరుగా రేషన్ దుకాణా దారులతో మాట్లాడుకున్న అక్రమార్కులు పెద్ద ఎత్తున చీకటి వ్యాపారం చేస్తూ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీరుచేస్తున్న వ్యాపారాన్ని పసిగట్టిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం నేతృత్వంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముమ్మరంగా దాడులు జరుపుతున్నారు. అయినా కొంతమంది అక్రమార్కులు దారికి రావడం లేదు.
విచ్చలవిడిగా రేషన్ దందా సాగిస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులలపై కొందరు రాజకీయ నాయకుల అండదండలను చూసుకుని అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దీనిలో భాగంగానే అగ్రహారం కాలనీలో అశోక్ అనే వ్యక్తి ఇంటి వద్ద నిల్వ ఉంచిన 25 క్వింటాలు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన రేషన్ దందా దారుడు సమాచారం ఇచ్చిన వారిని ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది.