- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం: ప్రభుత్వ భూములను తవ్వేస్తున్నారు.. అడిగినవారిని తొక్కించేస్తున్నారు..?
దిశ, కామారెడ్డి రూరల్ : అక్రమ మొరం తవ్వకం దారులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అందినకాడికి దండుకోవడం కోసం ఎవరినీ లెక్క చేయడం లేదు. అవసరమైతే అడ్డు వచ్చిన వారిపై టిప్పర్లు ఎక్కించేయాలంటూ యజమానులు, వర్కర్లకు హుకుం జారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దందా, బెదిరింపులు ఎక్కడో కాదు.. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోనే కొనసాగుతుండడం గమనార్హం. కామారెడ్డి మండలం, గూడెం శివారులోని సర్వే నంబర్ 49 లోని ప్రభుత్వ భూమిలో కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి యథేచ్ఛగా భూములను తవ్వుతూ అక్రమంగా మొరం తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ లతో పాటు కామారెడ్డి పట్టణానికి బిజినెస్ నిమిత్తం తరలిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు.
గ్రామాల్లో ఎవరైనా పేదలు తమ ఇళ్ల ముందు ఒక ట్రాక్టర్ మొరం పోయమని బతిమిలాడినా పట్టించుకోకుండా కామారెడ్డికి తరలిస్తున్నారు. ఒకరిద్దరికి మొరం పోసినప్పటికీ అధిక డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. టిప్పర్లలో మొరం తరలిస్తుండడంతో విలువైన బీటీ, సీసీ రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. అక్రమ మొరం తరలింపు దందా యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ అధికారులెవరు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యాపారం సాగుతున్నట్లుగా స్పష్టం అవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. పెద్ద పెద్ద గుంతలు తవ్వి, మొరం తరలిస్తుండడంతో క్వారీలను తలపిస్తున్నాయి. ఈ క్వారీల్లో ఏవైనా ఆ సాంఘిక పనులు జరిగితే కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు సైతం గుంతల్లో పడి చనిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. నెలల తరబడి మొరం తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరు ఇటువైపుగా కన్నెత్తి చూడకపోవడం శోచనీయం.
ధ్వంసమవుతున్న రోడ్లు..
టిప్పర్లు, ట్రాక్టర్ లలో అధిక లోడుతో మొరం తరలిస్తుండడంతో విలువైన బీటీ, సీసీ రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ప్రభుత్వం ఓవైపు లక్షలాది రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మిస్తుంటే.. అక్రమ మొరం తరలింపు దారులు మాత్రం యథేచ్ఛగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. పరిమితికి మించి మొరం తరలిస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా అతివేగంగా రోడ్లపై నుంచి వెళుతుండటంతో రోడ్డు పక్కనే గల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలు, పశువులు రోడ్డు పైకి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఆవేదన చెందుతున్నారు.
వీరి ఆగడాలను ఆపే వారే లేరా..
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేపట్టడంతో పాటు పరిమితికి మించి మొరం తరలిస్తూ రోడ్లు ధ్వంసం చేస్తుండడం, అతి వేగంగా టిప్పర్ లను నడిపిస్తుండడం చేస్తున్న వీరి ఆగడాలను పట్టించుకునే వారే లేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు నిద్ర పోవడం వల్లనే వీరి ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు.
మొరం తరలిస్తే చర్యలు తీసుకుంటాం- ఆర్ఐ నవీన్ కుమార్
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. గూడెం శివారులోని ప్రభుత్వ భూముల్లో మొరం తవ్వకాలు చేపడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. వెంటనే జేసీబీతో పాటు టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేస్తాం.