- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్ట పగలే అక్రమ మైనింగ్.. అడిగేవారెవరు?
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: నిరంతర నిఘా.. పర్యవేక్షణ.. గ్రామ స్థాయి అధికార వ్యవస్థ.. ఉండగానే ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవడం కష్టమైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. పర్యవేక్షణ కొరవడంతో ఇసుకాసురులు ఎక్కడికక్కడే ఇసుక డంపులు చేసి విక్రయిస్తూ వేలకు వేలు దండుకుంటున్నారు.
గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వో, వీఆర్ఏ కీలకంగా ఉంటారు. వారి అదుపు ఆజ్ఞలు ఉండటంతో ఇసుక రవాణా నియంత్రణ ఉండేది. గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాపై వారి నిరంతరం దృష్టి సారించి తరలింపును అడ్డుకునేవారు. అలాగే కృత్రిమ ఇసుక తయారీపై కూడా నిఘా వేసేవారు. దీనిపై మండల, జిల్లా స్థాయి అధికారులకు వీఆర్వో వ్యవస్థ ద్వారానే సమాచారం అందించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది.
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
ప్రస్తుతం ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామాలలో నిఘా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. గ్రామాల్లో ఇప్పుడు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే చెప్పాలి. చాలా రోజులుగా రెవెన్యూ అధికారులు గ్రామాలపై దృష్టి సారించడం పూర్తిగా మానేశారు. దీంతో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇసుకాసురులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వాగులో ఇసుక ట్రాక్టర్లు పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. అధికారులు కూడా పెద్దగా పటించుకునే పరిస్థితి లేకపోవడంతో పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్చగా ఇసుక తరలిస్తున్నారు.
కాసుల వర్షం
ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు అరుకాయలుగా కొనసాగుతున్నది. ఇసుక రవాణా చేసే వారితో పాటు పలు స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. రెవెన్యూ వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలోని నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ఇసుకాసురులు తాపత్రయ పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇసుక డంపింగ్ చేస్తూ అక్రమంగా విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. మండల రెవెన్యూ అధికారులు కార్యాలయాలకే పరిమితమవడంతో పోలీసులు కూడా ఇసుక రవాణాదారుల నుంచి పెద్ద మొత్తంలో దండుకుంటున్నట్లు తెలుస్తున్నది.