- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులకు భద్రత కరువు.. సుల్తాన్‌పూర్‌లో సూపర్వైజర్‌పై దాడి
దిశ, జల్‌పల్లి: సుల్తాన్‌పూర్‌లో అనుమతి లేకుండా జరుగుతోన్న నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్ళిన జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ ప్రవీణ్‌కుమార్‌ను నిర్భంధించిన ఘటన మరువకముందే మరో ఘటన చర్చనీయాంశంగా మారింది. తాజాగా 18వ వార్డు ఇంద్రా సొసైటీలో జరుగుతోన్న అక్రమ నిర్మాణాల పరిశీలనకు వెళ్లిన శానిటైజర్ సూపర్వైజర్ కుమార్‌పై స్థానికులు దాడిచేశారు. వరుసగా జల్‌పల్లి మున్సిపల్ అధికారులపై జరుగుతున్న దాడులతో మున్సిపాలిటీలో ఉద్యోగం కత్తిమీద సాములామారింది. అధికారులను ‘మీ అంతు చూస్తామని’ అక్రమ నిర్మాణాదారులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీంతో ఎపుడు, ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియక అధికారులు అయోమయ స్థితిలో పడ్డారు.
బిక్కు బిక్కుమంటూ భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు ఇంద్రా సొసైటీలో అనుమతి లేకుండా జరుగుతున్న షెడ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు సోమవారం టీపీఓ హబీబ్ ఉన్నీసా, శానిటైజర్సూపర్వైజర్ కుమార్‌తో పాటు ఇతరులు వెళ్లారు. ఈ నిర్మాణాలకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపెట్టమనడంతో ఆగ్రహించిన నిర్మాణాదారులు శానిటైజర్వైజర్ కుమార్‌పై బహిరంగంగా దాడికి దిగారు. దీంతో జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులపై దాడిచేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును పహాడిషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.