వర్చువల్ ప్రిపరేషన్స్‌లో గోవా బ్యూటీ

by Shyam |
వర్చువల్ ప్రిపరేషన్స్‌లో గోవా బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ రీడింగ్‌లో బిజీగా ఉంది. సోనీ పిక్చర్స్ బ్యానర్‌పై ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ సినిమా చేస్తున్న ఇల్లీ బేబీ.. హీరో రణ్‌దీప్ హుడాతో కలిసి స్క్రిప్ట్ చదువుతోంది. ఈ మేరకు ‘కలిసే కానీ వర్చువల్‌’గా అంటూ పోస్ట్ పెట్టింది ఇలియానా.

ప్రస్తుతం స్క్రిప్ట్ రీడింగ్ ఇలా ఉందని రణ్‌దీప్ హుడాతో వీడియో కాల్ పిక్స్ షేర్ చేసిన గోవా భామ.. కొత్త సాధారణం, ఇది సరికొత్త అనుభవమే కానీ, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి ఎగ్జైట్‌మెంట్, థ్రిల్ ఉంటుందో అంతే అనుభూతి ఇప్పుడు కూడా ఉందని చెప్పింది. బల్విందర్ సింగ్ జనుజ ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

కాగా ఇలియానా అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించిన ‘ది బిగ్ బుల్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ దేవగన్, ఆనంద్ పండిట్ నిర్మించిన సినిమాకు కూకి గులాటి దర్శకత్వం వహించగా.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story