ఇల్లీ బేబి సన్ బాత్ డ్రీమ్స్

by Shyam |
ఇల్లీ బేబి సన్ బాత్ డ్రీమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : గోవా బ్యూటీ బీచ్‌ను బాగా మిస్ అవుతున్నట్టుంది. అందుకే ఇంట్లో ఉన్నా బీచ్‌లో ఉన్నట్లు డ్రీమ్స్‌లో విహరిస్తోంది. వెకేషన్ మూడ్‌లో ఉన్నా, బిజీ షెడ్యూల్‌ వల్ల వెళ్లడం కుదరక.. అక్కడికెళ్తే ఎలా ఉంటుందో కలలు కంటూ థ్రో బ్యాక్ పిక్స్ షేర్ చేస్తోంది. ఓ పిక్‌లో బీచ్‌ ఒడ్డున సన్ బాతింగ్ డ్రీమ్‌లో ఉన్న ఇల్లీ బేబి.. బ్లాక్ బికినీ, బ్లూ స్విమ్ సూట్‌లో మోస్ట్ బ్యూటిఫుల్‌గా కనిపించింది. సూపర్ హాటెస్ట్‌గా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెంటల్‌గా బీచ్‌లో ఉన్నా, తను మాత్రం చాలా అవసరమైన కుటుంబం మధ్యలోనే ఉన్నానంటోంది. అయినా సంతోషంగానే ఉన్నానంటూ సెలవిస్తోంది. ఐలాండ్ వెకేషన్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. మెమొరీస్ రీకాల్ చేసుకుంటున్నట్లు చెప్తోంది.

ఐలాండ్ లైఫ్‌ లవర్ అయిన ఇలియాన.. ఈ మధ్యే ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ సినిమా ఫిల్మింగ్ కంప్లీట్ చేసింది. రణ్‌దీప్ హుడాతో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమాకు బల్వీందర్ సింగ్ డైరెక్టర్. ఇక అభిషేక్ బచ్చన్‌తో నటించిన ‘ది బిగ్ బుల్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story