- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబార్షన్ చేయించుకున్న ఇలియానా..
దిశ, సినిమా: స్టార్స్ గురించి రూమర్స్ స్ప్రెడ్ కావడం నార్మల్. కానీ అవి మితిమీరితే పర్సనల్‌గా చాలా డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది. మరి అలాంటి డైజెస్ట్ చేసుకోలేని న్యూస్‌పై తాను ఎలా స్పందించిందో చెప్పుకొచ్చింది బ్యూటిఫుల్ ఇలియానా. గతంలో తనపై వచ్చిన రూమర్స్ ఎంత షాకింగ్‌గా ఉన్నాయనే విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. కొన్ని వార్తలు కామెడీగా ఉంటాయని, అసలు అలాంటి న్యూస్ ఎలా వస్తుందో కూడా తెలియదని నవ్వేసింది. తాను ప్రెగ్నెంట్ అని, ఈ విషయం బయటకు రాకుండా అబార్షన్ కూడా చేయించుకున్నానని వచ్చిన ఫేక్ న్యూస్‌పై ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియలేదని చెప్పింది.
ఇక మరోసారి ‘ఇలియానా ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కానీ ప్రాణాలతో బయటపడింది.. ఈ విషయాన్ని పని మనిషి ధృవీకరించింది’ అనే న్యూస్ చూసి షాక్ అయ్యానని తెలిపింది. ‘అసలు తనకు పనిమనిషే లేదు.. సూసైడ్ అటెంప్ట్ చేయలేదు.. తాను బతికే ఉన్నాను’ అని ఎలా చెప్పుకోవాలి అంటూ నవ్వేసింది ఇల్లీ బేబి. ఈ క్రమంలోనే 2018లో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో ఫస్ట్ చైల్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందని వార్తలు రాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌తో ఈ రూమర్స్‌ను ఖండించిందని, తాను గర్భవతి కాదని చెప్పిందని న్యూస్ రాశారని వివరించింది. అయితే మరీ ఇంత వింతగా వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదంది ఇల్లీ బేబి.