బయోడీగ్రెడబుల్ వూండ్ మెటీరియల్.. కనుగొన్న పరిశోధకులు

by  |   ( Updated:2021-08-10 04:47:02.0  )
బయోడీగ్రెడబుల్ వూండ్ మెటీరియల్.. కనుగొన్న పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్ : గువాహటిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) పరిశోధకులు బయోడిగ్రేడబుల్ ‘వూండ్ డ్రెస్సింగ్ మెటీరియల్’ను కనుగొన్నారు. సింథటిక్ పాలిమర్‌తో రూపొందిన ఈ మెటీరియల్ నాన్ టాక్సిక్ కావడంతో పాటు, ఎండోజెనస్ ఎంజైమ్‌ల ద్వారా శరీరం స్వయంగా నయం అయ్యేలా ఉండే తేమ వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి సంబంధించిన పరిశోధనలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ మాక్రోమాలిక్యుల్స్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

గాయాలైనప్పుడు సాధారణంగా కాటన్ వూల్, లింట్, గాజెస్ వంటి వాటిని డ్రెస్సింగ్ మెటీరియల్స్‌గా ఉపయోగిస్తున్నాం. అయితే వీటిని తీసేసమయంలో మాత్రం నయమైన కణజాలాన్ని కూడా దెబ్బతీయడం డిస్ అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా వూండ్ డ్రెస్సింగ్ కోసం పాలిమర్ హైడ్రోజెల్ ఫిల్మ్‌ల‌తో పాటు, ఆప్టిమైజేషన్ కోసం నాలెడ్జ్ ఫ్రేమ్‌ వర్క్‌ను ఐఐటీ పరిశోధకులు కనుగొన్నారు. గాయపడిన కణాల వృద్ధికి తగిన వాతావరణాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాల వేగవంతమైన పెరుగుదలకు ఇది దోహదపడుతుందని బృంద సభ్యులు పేర్కొన్నారు.

ఉపయోగాలు..

లో కాస్ట్ : ఇది పర్యావరణానికి ఎలాంటి హానీ చేయదు. అంతేకాదు ప్రస్తుతం మార్కెట్లో దొరికే వూండ్ మెటీరియల్స్ కన్నా వీటి ధర చాలా తక్కువ.

ట్రాన్సపరెంట్: పారదర్శకం కావడం వల్ల డ్రెస్సింగ్ మెటీరియల్స్ మార్చకుండానే గాయాన్ని పరిశీలించొచ్చు. ఈ బ్యాండ్ అందించే తేమతో కూడిన వాతావరణం కారణంగా ఈజీగా శరీరం నుంచి తీసివేయవచ్చు.

సూపర్ అబ్సర్బెంట్ : గాయం ఉపరితలంపై ఎక్సూడేట్ పేరుకుపోవడాన్ని నివారించడానికి మెసెరేషన్‌కు దారితీస్తుంది.

అడెక్వేట్ మెకానికల్ క్యారెక్టర్‌స్టిక్స్: వైద్య సమయంలో మచ్చ ఏర్పడకుండా ఉండటానికి ఇది సాయపడుతుంది. వాతావరణ కాలుష్యం నుంచి కూడా గాయానికి తగిన రక్షణ అందిస్తుంది.

Advertisement

Next Story