ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ‘చార్జింగ్ స్టేషన్’

by Shyam |
ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ‘చార్జింగ్ స్టేషన్’
X

దిశ, వెబ్‌డెస్క్: సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో అద్భుతమైన ఆవిష్కరణలు వెలుగుచూస్తాయి. ఒకవేళ ఆ ఆవిష్కరణ పర్యావరణహితమైనది కావడంతో పాటు, సమాజానికి ఉపయోగపడితే అంతకుమించిన గొప్ప ఆవిష్కరణ ఏముంటుంది. అలాంటిదే ఇది..ప్రస్తుత కాలంలో మొబైల్ నుంచి బైక్‌ల వరకు అన్నిటికీ చార్జింగ్ అవసరం. ఈ చార్జింగ్ స్టేషన్స్ పర్యావరణ హితం చేయడంలో భాగంగా సస్టెయినెబుల్ ఎన్విరాన్జీ రీసెర్చ్ ల్యాబ్(ఎస్ఈఆర్ఎల్) పరిశోధకుల బృందం, అధిక మన్నికైన వనాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ (విఆర్‌ఎఫ్‌బి) ఆధారిత చార్జింగ్ స్టేషన్‌ రూపొందించింది. ఇటీవల దాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) -ఢిల్లీ క్యాంపస్‌లో ప్రారంభించింది.

లిక్విడ్ ఎలక్ట్రోలైట్‌ను వినియోగించుకుని ‘వనాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ’(విఆర్‌ఎఫ్‌బి) విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుంటోంది. చార్జింగ్ చేసే క్రమంలో విద్యుత్ శక్తి ‘లిక్విడ్ ఎలక్ట్రోలైట్’ రూపంలో స్టోర్ కాగా, ఈ డివైజ్ సాయంతో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌, పోర్టబుల్ చార్జర్లు, మొబైల్ బ్యాంకులు, టాబ్లెట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు గ్రామీణ విద్యుదీకరణ, ఈ వెహికల్ చార్జింగ్ అవసరమైన విద్యుత్ శక్తిని పొందవచ్చు. ఇది పునరుత్పాదక శక్తిని సమర్థవంతంగా నిల్వ చేయడం వల్ల విద్యుత్ శక్తి అవసరమైన ప్రతి చోటా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది కాలుష్యరహితమైన డివైజ్ కావడంతో పాటు, సంప్రదాయిక బ్యాటరీకి విరుద్ధంగా తక్కువ ఖర్చుతో లాంగ్ డిశ్చార్జింగ్ టైమ్‌ను కలిగి ఉంటుంది. డీజిల్ జనరేటర్లకు బదులుగా వీటిని ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed