- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇఫ్తార్ విందులకు అనుమతి లేదు: కలెక్టర్ శరత్
దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని, ఇఫ్తార్ విందులకు అనుమతి లేదని నిజామాబాద్ కలెక్టర్ శరత్ చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత హలులో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్ శరత్ మాట్లాడుతూ రంజాన్ పురస్కరించుకొని ప్రార్థనల కోసం ముస్లింలు మసీదులకు వెళ్లొద్దని కొరారు. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. మసీదులో ప్రార్థనలు చేయడానికి ఇమామ్తోపాటు నలుగురికి అనుమతి ఉంటుందని సూచించారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ వ్యాపారస్తులకు వాట్స్అప్ ద్వారా సమాచారం ఇస్తే సంచార వాహనాల ద్వారా సరుకులను ఇంటికే పంపిస్తారని చెప్పారు. కారణం లేకుండా రోడ్లపైకి వస్తే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షబున, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజేశ్వర్, దేవేందర్ రెడ్డి, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, శశాంక్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: Nizamabad, collector, sharath, Meeting