- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్శకుడు నటుడిగా మారితే!
దర్శకుడు .. కెప్టెన్ ఆఫ్ ద షిప్. 24 విభాగాలను సమన్వయం చేసే సినిమా అధినేత. ఈ క్రమంలో ఎన్నో బరువులు మరెన్నో బాధ్యతలు. ఒక కథకు దృశ్యరూపం ఇవ్వాలనుకుంటే పడే కష్టాలు అంతాఇంతా కాదు. నిర్మాతను ఎంచుకుని… నటీనటుల ఎంపిక కోసం రాత్రింబవళ్లు కష్టపడి… టెక్నికల్ డిపార్ట్‌మెంట్ సెట్ చేసుకునేందుకు నెలల తరబడి వాళ్ల చుట్టూ తిరిగి తర్వాత సినిమా మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని కష్టాలనైనా భరిస్తూ తనలో ఉన్న నటున్ని మరోనటుడి రూపంలో వెండితెరపై చూపించేందుకు ప్రయత్నిస్తాడు. తన ఇమాజినేషన్‌లో ఉన్న ఔట్‌పుట్‌ను తెరపై చూపించి ఆడియన్స్‌ను మెప్పించాలని అనుకుంటాడు. బలమైన కథ ఉన్నా దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడితే సినిమా ఫ్లాపే. అందుకే సినిమా చేసినన్నాళ్లు ఆ కథనే కలగంటాడు. ఆ కథ గురించే మాట్లాడ్తాడు. ఆ కథ ఆలోచిస్తూనే తింటాడు. అలాంటప్పుడే సినిమాకు విజయం చేకూరేది. వేల కుటుంబాలు ఆ సినిమా తీయగా వచ్చిన డబ్బుతో జీవించేది.
మరి అలాంటి డైరెక్టర్ … ఒక నటుడు అయితే ఎలా ఉంటుంది. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్ దగ్గర పనిచేస్తే నటుడిగా తనలోని ప్రతిభ ఎలా ఉంటుంది. తెరపై తన విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు ఏం అంటారు? అఫ్ కోర్స్… గొప్పగా ఉంటుంది. ఈ మధ్య డైరెక్టర్లు .. హీరోలు అయిపోతున్నారు. కటౌట్‌తో అవసరం లేకుండా కంటెంట్ ఉన్నా చాలనుకున్నప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడంలో తప్పేముందని భావిస్తున్నారు. అలా హీరో అయిన వారే సీనియర్ డైరెక్టర్ ఎస్ జే సూర్య. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా డైరెక్టర్‌గా గుర్తుండిపోయిన సూర్య సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్పైడర్ సినిమాలో విలన్‌గా వావ్ అనిపించాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ హీరోయిజం కన్నా సూర్య విలనిజానికే మార్కులు పడ్డాయి. మనుషుల రక్తాన్ని చూసి ఆనందపడే పాత్రలో మనుషులను చంపే రాక్షసుడిగా నూటికి నూరు శాతం మార్కులు వేయించుకున్నాడు.
యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ .. ఏ మాయ చేశావే సినిమాతో ఫీల్ గుడ్ లవ్ స్టోరిని అందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాగా… ఆయన తమిళంలో చేసిన సినిమాలు సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్, రాఘవన్, చెలి పేరుతో తెలుగులో డబ్ అయి మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే గౌతమ్ మీనన్‌కు నటనపై ఉన్న ఆసక్తితో తన సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా ఫుల్ లెంత్ రోల్ చేసే అవకాశం ఇన్నాళ్లు రాలేదు. కానీ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న కనులు కనులు దోచాయంటే సినిమాతో తన డ్రీమ్ నెరవేరింది. అతిథి పాత్ర కాదు, సపోర్టింగ్ యాక్టర్ అంతకన్నా కాదు, విలన్ షేడ్స్ రోల్‌తో దుమ్ము లేపేశాడు. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ చూపించిన విలనిజానికి ఆయన సినిమాల్లో పని చేసిన హీరోలు కూడా షాక్ అయి ఉంటారు. మేం గౌతమ్ ముందు ఎంత అనే అనుకుంటారు. పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన గౌతమ్… తన సినిమాల్లో పోలీస్ ఆఫీసర్స్‌ను మరిపించారని విమర్శకులు సైతం ప్రశంసించారు.
అనురాగ్ కశ్యప్… బాలీవుడ్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, బాంబే వెల్వెట్, బాంబే టాకీస్ లాంటి సినిమాలతో హిందీ సినిమాల్లో దర్శకులుగా తనదైన ముద్ర వేశాడు. బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్, లక్ బై డ్యాన్స్, దేవ్.డి, గులాల్ లాంటి సినిమాల్లో నటుడిగా మెప్పించాడు. తెలుగులో నయనతార మెయిన్ లీడ్‌లో వచ్చిన అంజలి సీబీఐ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనురాగ్ కశ్యప్. సినిమాలో విలన్‌గా వావ్ అనిపించాడు. పోలీస్ ఆఫీసర్ నెగెటివ్‌గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. అనురాగ్ కశ్యప్ విలనిజానికి ఫిల్మ్ మేకర్స్ సాహో అన్నారు.
కరణ్ జోహార్ … బాలీవుడ్ కింగ్ మేకర్. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, నటుడిగా ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగిన కరణ్ జోహార్… బాంబే వెల్వెట్‌లో విలన్‌గా చేశాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో టిపికల్ విలన్‌గా కనిపించాడు కరణ్. పార్సీ మీడియా మొగల్‌గా కనిపించిన కరణ్ పాత్రకు విలన్‌గా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నాడు.
తెలుగులో లేటెస్ట్‌గా డైరెక్టర్ హీరో అయ్యాడనే ఘనత తరుణ్ భాస్కర్‌కే చెల్లింది. తనను హీరోగా నిలదొక్కుకునేలా చేసిన డైరెక్టర్ తరుణ్‌ను హీరోను చేశాడు విజయ్ దేవరకొండ. మీకు మాత్రమే చెప్తా సినిమాకు నిర్మాతగా మారి డైరెక్టర్‌ను నటున్ని చేశాడు. అనుకోకుండా ఓ వీడియోతో అన్ పాపులర్ అయ్యే క్రమంలో హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడు… యూట్యూబ్‌లో అప్ లోడ్ అయిన వీడియోను ఎలా డిలీట్ చేయగలిగాడు అనేది కథ. కాగా … తరుణ్ భాస్కర్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆడియన్స్‌తో శభాష్ అనిపించాడు.