రాజయ్య 1978లో మరణిస్తే 1980లో సంతకం ఎలా పెడతారు..?

by Shyam |
రాజయ్య 1978లో మరణిస్తే 1980లో సంతకం ఎలా పెడతారు..?
X

దిశ, ఆర్మూర్ : ఇందారపు రాజయ్య 1978లో చనిపోతే 1980లో సంతకం ఎలా పెడతారని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి స్థలం విషయమై 1వ వార్డు కౌన్సిలర్ ఖాందేష్ సంగీత భర్త శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు, ఇందారపు రాజయ్య వారసులకు మధ్య వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య పరస్పరం వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇందారపు రాజయ్య వారసులు పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ తండ్రి ఇందారపు రాజయ్య 1978లో చనిపోతే 1980లో ఆ భూమిని వారికి అమ్మినట్టు ఖాందేష్ శ్రీనివాస్ ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నాడనే విషయం అర్థవుతోందన్నారు. చాలా ఏళ్లుగా తాము ఇంటి పన్ను, నీటి పన్ను మున్సిపాలిటీకి చెల్లిస్తున్నామని చెప్పారు. ఖాందేష్ శ్రీనివాస్ అధికార బలంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో బాధితులు ఇందారపు నర్సయ్య, దుబ్బయ్య, రాజు, గోపి, వినోద్ తోపాటు ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed