Cyber Crime: ‘ఎమ్మెల్యే కొడుకు డబ్బులు అడుగుతుండని..’

by Shyam |   ( Updated:2021-05-28 04:08:39.0  )
Cyber Crime:  ‘ఎమ్మెల్యే కొడుకు డబ్బులు అడుగుతుండని..’
X

దిశ, మిర్యాలగూడ : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఓ కలెక్టర్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసి పలువురి నుండి డబ్బులు దండుకున్న విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు ఓ ఎమ్మెల్యే తనయుడి ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేశారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కుమారుడు ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్ధ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆయన ఫొటోతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సృష్టించిన హ్యాకర్లు ఆయన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారి నుంచి డబ్బులు అడుగుతున్నట్టు సమాచారం.

విషయం తెలిసిన సిద్దార్ధ తన స్నేహితుల జాబితాలో ఉన్నవారు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే కొడుకు డబ్బులు అడుగుతుండని అలోచించకుండా డబ్బులు బదిలీ చేయవద్దని సిద్దార్థ తెలిపారు. తన ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ పేరుతో ఎవరైనా నగదు అడిగినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయొద్దని, తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed