సోషల్ మీడియాకు ఐడీ సిస్టమ్ కావాలంటున్న సోనమ్..!

by Jakkula Samataha |   ( Updated:2021-03-25 11:03:48.0  )
sonam kapoor
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా ఒకప్పుడు టైంపాస్. ఇప్పుడు సమాచార పంపిణీ, స్వేచ్ఛాయుత భావవ్యక్తీకరణకు మంచి ప్లాట్ ఫామ్. ప్రస్తుతం సొసైటీలోని సమాచార మాధ్యమాలపై విశ్వసనీయత కొరవడటంతో చాలా మంది ఈ ప్లాట్ ఫాంను నమ్ముకుంటున్నారు. ఓ సాధారణ పౌరుడి నుంచి దేశ ప్రధానమంత్రి వరకు తమ అభిప్రాయాలను నిక్కచ్ఛిగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వ్యక్తుల మీద అభిమానాన్ని కానీ, ప్రభుత్వాల మీద వ్యతిరేకతను కానీ ఈ మాద్యమాల ద్వారా స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. అయితే, కొందరి వలన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలుగుతోంది. నెగెటివ్‌గా కామెంట్స్ చేయడం, దూషించడంతో పాటు విపరీతంగా ట్రోల్స్ చేయడం వలన చాలా మంది సెలెబ్రిటీలు, ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు చరమగీతం పాడుతున్నారు. ఈ ట్రోల్స్ తమ వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా, తమ ఫ్యూచర్ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తనపై విపరీతమైన ట్రోల్స్ రావడంతో ‘మోడల్ క్రిస్సీ టీజెన్’ తన ప్రతికూలతను పేర్కొంటూ ట్విట్టర్ ఖాతాను తొలగించింది.

దీనిపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఇకమీదట సోషల్ మీడియా ఖాతాలను తెరవడానికి ప్రజలకు ఐడీ ప్రూఫ్‌లు అవసరమని’ సూచించారు. మేమంతా ట్విట్టర్ నుంచి నిష్క్రమించాలా..? అని ప్రశ్నించారు. తనకు సంబంధించిన వార్తలను సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటాను. అయితే..సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం లేదు’’ అని ఆమె రాసుకొచ్చింది. ‘‘సోషల్ మీడియా ఖాతాలను తెరవడం అంటే వాస్తవ ప్రపంచంలో ఏ ఇతర ఖాతాలను తెరిచినట్లుగా ఉండాలి’’ అని సోనమ్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed