ఐసీయూ కీ దొరకలేదు.. పేషెంట్ చనిపోయింది

by Shamantha N |
ఐసీయూ కీ దొరకలేదు.. పేషెంట్ చనిపోయింది
X

భోపాల్: మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి ఐసీయూ తాళంచెవి దొరక్కపోవడంతో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న 55 ఏళ్ల మహిళ చనిపోయింది. ఉజ్జయిని జిల్లాకు చెందిన ఆ మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ జిల్లా ఆస్పత్రిలో గురువారం రాత్రి అడ్మిట్ అయ్యారు. కరోనా లక్షణాలుగా భావించి టెస్టుల కోసం ఆమె నుంచి శాంపిల్ తీసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో కొవిడ్ 19 కేసులను పర్యవేక్షిస్తున్న మాధవ్ నగర్ లోని ఆస్పత్రికి తరలించేందుకు డాక్టర్లు నిర్ణయించుకున్నారు.

కానీ, ఆమెను ఆర్ డి గార్డి ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అంబులెన్స్ లో తీసుకెళ్లగా ఆస్పత్రిలోని ఐసీయూకు సంబంధించిన సిబ్బంది లేకపోవడంతో తాళంచెవి కోసం ఇతర సిబ్బంది వెతికారు. అనంతరం ఐసీయూ లాక్ పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు లాక్ పగులగొట్టి లోనకు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించిన ఆ మహిళను కాపాడేందుకు వైద్యులను సహకరించిన సాధ్యం కాలేదు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ లాంటి సమస్యలతో ఆ మహిళ బాధపడినట్టు ఉజ్జయిని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనసూయ తెలిపారు. అయితే కరోనా టెస్ట్ ఫలితాలు ఇంకా రావలసి ఉంది.

Tags: ICU, tests, coronavirus, key, found, died, patient, madhya pradesh

Advertisement

Next Story

Most Viewed