కొత్త గైడ్ లైన్స్ వచ్చేశాయి.

by Shamantha N |
కొత్త గైడ్ లైన్స్ వచ్చేశాయి.
X

దిశ వెబ్ డెస్క్: కరోనా తీవ్రతతో ఐఎసీఎంఆర్ మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్ మెకానిజంపై ప్రధానంగా దృష్టి సారించాలని తెలిపింది. ఈ సందర్భంగా పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్టులు నిర్వహించాలని సూచించింది. కంటైన్‌మెంట్ జోన్లలో ప్రతి ఒక్కరికీ రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయాలనీ, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల్లో తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలని సూచించింది. పాజిటివ్ నిర్దారణ అయిన ఐదు నుంచి పదిరోజుల మధ్యలో మరోసారి పరీక్షలు చేయాలని తెలిపింది. పరీక్షల కోసం ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సూచించింది. వైరస్ నిర్దారణకు మొదట ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయాలనీ, ఆ తర్వాతే ఆర్ టీ పీసీఆర్ లేదా ట్రూనాట్ లేదా సీబీఎన్ఏఏటీ టెస్టులు చేయాలని సూచించింది. రాపిడ్ లో నెగెటివ్ అని తేలినా లక్షణాలు ఉంటే మరోసారి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రెండో సారి కూడా రాపిడ్ లేదా ఆర్ టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. వృద్దులు, రోగులు మరియు వైరస్ ముప్పు ఉన్న వారందరికీ పరీక్షలు తప్పనిసరి అని మార్గదర్శకాలను విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed