కంటి సమస్యలు.. ఐసీఎంఆర్​,ఎన్ఐఎన్​ సర్వేలో ఆసక్తికర విషయాలు

by Shyam |   ( Updated:2021-10-07 22:33:05.0  )
కంటి సమస్యలు.. ఐసీఎంఆర్​,ఎన్ఐఎన్​ సర్వేలో ఆసక్తికర విషయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా చిన్నారులకు సరైన పోషకాలు అందట్లేదని ఐసీఎంఆర్​(ఇండియన్​ కౌన్సిల్​ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​), ఎన్​ఐఎన్​​(నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్​) సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో 20 శాతం మంది చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నది. వీరిలో 5 ఏళ్లు లోపు వారే అత్యధికంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్టు వెల్లడించింది. విటమిన్​ ఏ లోపంతో కంటి పొరలు తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో రాష్ట్రంలో 198 అమ్మాయిలు, 172 మంది అబ్బాయిలపై పరిశోధనలు నిర్వహించినట్లు పేర్కొన్నది.

వీరిలో అత్యధికంగా విటమిన్​ ఏ లోపంతో కంటి పొరలు తీవ్రంగా దెబ్బతింటున్నట్టు స్పష్టం చేసింది. దీంతో కళ్లు పొడిబారిపోవడం, రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటున్నట్లు వివరించింది. ఇలాంటి వారిలో నల్లగుడ్డు పక్కన తెల్లమచ్చలు ఏర్పడి ఉంటాయి. అయితే దీనికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటిలోని నల్లగుడ్డు దెబ్బతిని చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని ఎన్​ఐఎన్​ సైంటిస్టులు వెల్లడించారు. పుట్టినప్పుడు ఆరు నెలల పాటు తల్లిపాలను సరిగ్గా తీసుకోకపోవడం, ఆ తర్వాత విటమిన్లతో కూడిన పౌష్టికాహారం అందకపోవడంతోనే సమస్య మరింత పెరిగినట్టు వివరించింది. పౌష్టికాహారంపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నట్లు నొక్కి చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed