- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాల్లో దూసుకు పోతున్న ఐసీఐసీఐ..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మొదటిసారిగా రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఘనతను సాధించింది. అంతేకాకుండా ఈ మార్కును చేరుకున్న రెండో బ్యాంకుగా నిలిచింది. ఇప్పటివరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 8.7 లక్షల కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 0.79 శాతం లాభపడి రూ. 724.50 వద్ద ర్యాలీ చేసింది. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,01,202 కోట్లకు చేరుకుంది. అలాగే, ఈ ర్యాలీలో బ్యాంకు రూ. 734.85 వద్ద గరిష్ఠ స్థాయిలను తాకింది.
ఇక, అత్యధిక మార్కెట్ క్యాపి కలిగిన బ్యాంకుల జాబితాలో రూ. 3.81 లక్షల కోట్లతో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా, కోటక్ బ్యాంకు రూ. 3.47 లక్షల కోట్లతో, యాక్సిస్ బ్యాంక్ రూ. 2.46 లక్షల కోట్లతో తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. రిటర్నుల అంశంలో ఎస్‌బీఐ తర్వాత రెండో అత్యధిక లాభాలను ఆర్జించిన బ్యాంకుగా 95 శాతంతో ఐసీఐసీఐ ఉంది.