- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాక్సినేషన్‌కు అవసరమయ్యే కోల్డ్‌స్టోరేజ్, రవాణా అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఐస్‌మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ తెలిపింది. ప్రముఖ కూలింగ్ సొల్యూషన్స్, రిఫ్రిజిరేషన్ ఎక్విప్‌మెంట్ తయారీ, సరఫరా సంస్థ అయిన ఐస్‌మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్(ఐస్‌మేక్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 30.06 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు వెల్లడించింది. కరోనా మహమ్మారి సవాళ్లు ఉన్నప్పటికీ కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది.
గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 25.25 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 1.84 కోట్లని కంపెనీ పేర్కొంది. ‘ప్రస్తుత సంవత్సరం అసాధారణ సవాళ్లను ఎదుర్కొన్నాం. అయినప్పటికీ కోల్డ్ స్టోరేజీ, రవాణా అవసరాలకు సంబంధించి ఐస్‌మేక్ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అవసరమైన పరిష్కారాలను ఫార్మా కంపెనీలు, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ శాఖలకు అందించనుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు కావాల్సిన కోల్డ్ చైన్ యంత్ర సామగ్రి వ్యవస్థను ఐస్‌మేక్ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సీనియర్ బృంద సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని’ ఐస్‌మేక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్ పటేల్ చెప్పారు.