టీ20 వరల్డ్ కప్‌‌‌లో అతనితో ముప్పే : సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్

by Harish |   ( Updated:2024-05-13 15:18:19.0  )
టీ20 వరల్డ్ కప్‌‌‌లో అతనితో ముప్పే : సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బ్యాటర్లకు ముప్పుగా మారతాడని సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తెలిపాడు. ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ తరపున బుమ్రా అదరగొడుతున్న నేపథ్యంలో మిల్లర్ పై వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియా సంస్థతో మిల్లర్ మాట్లాడుతూ ‘భారత జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్‌. ప్రస్తుతం అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటర్‌‌గా అతనితో నాకు ప్రమాదమే. నాకే కాదు వరల్డ్ కప్‌లో బ్యాటర్లందరికీ అతనితో ముప్పు పొంచి ఉంది.’అని మిల్లర్ తెలిపాడు.

కాగా, బుమ్రా గతేడాది ఆగస్టులో ఐర్లాండ్‌పై భారత్ తరపున చివరి టీ20 ఆడాడు. నేరుగా ఐపీఎల్-17తోనే పునరాగమనం చేసిన అతను ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌‌లో భారత బౌలింగ్ దళాన్ని బుమ్రా నడిపించనున్నాడు. మరోవైపు, ఈ సీజన్‌లో తేలిపోయిన ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story