- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నరాలు తెగే ఉత్కంఠ.. మ్యాచ్ గెలిచి సెమీస్ చేరిన ఆఫ్ఘనిస్తాన్
దిశ, వెబ్ డెస్క్: 2024 టీ20 వరల్డ్ కప్ లోని సూపర్ 8 చిట్టచివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మధ్య జరిగింది. సెమిస్ లో మిగిలిని చివరి బెర్త్ కోసం మూడు జట్లు ఆదార పడ్డాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో అత్యంత క్రియాశీలకంగా మారిన ఆప్ఘనిస్థాన్ జట్టు గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నం చేసింది. మరోపక్క బంగ్లాదేశ్ కూడా గెలిచి సెమీస్ వెళ్లాలని బావించింది కానీ ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే ఒక్క మ్యాచ్‌లో వర్షం ఏకంగా ఐదు సార్లు అడ్డుతగిలింది. ఈ క్రమంలో కేవలం 116 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించి సెమీస్ చేరుకుంది. దీంతో బంగ్లా గెలుపుపై చిట్ట చివరి ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆఫ్ఘన్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచులో సౌతాఫ్రికాతో తలపడనుంది.
నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వివెట్ల నష్టానికి కేవలం 115 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ దిగిన బంగ్లాదేశ్ జట్టను ఓ వైపు ఆఫ్ఘన్ బౌలర్లు, మరోవైపు వర్షం ఉక్కిరి బిక్కిరి చేశాయి. చివర్లో వర్షం కారణంగా మ్యాచును 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించారు. అయినప్పటికి బంగ్లాదేశ్ జట్టు గెలవలేకపోయింది. తప్పనిసరి గెలవాల్సిన మ్యాచులో ఆఫ్ఘన్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శనను కనబరచారు. దీంతో బంగ్లా జట్టు 17.5 ఓవర్లకు ఆలౌట్ అయింది. అత్యంత కీలకమైన మ్యాచ్ లో విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో మొదటి సారి టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరుకుంది. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 4 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు, ఫారూఖీ, నబీ చెరో వికెట్ తీసుకున్నారు.