- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ లీగ్‌పై అథర్టన్ మండిపాటు
దిశ, స్పోర్ట్స్: భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్‌కప్ అర్హత కోసం ఐసీసీ ప్రవేశపెట్టిన ‘సూపర్ లీగ్’పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ మండిపడ్డాడు. సూపర్ లీగ్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లు సాధారణ ప్రేక్షకులకు అర్థమవుతాయా అని ప్రశ్నించారు. ఐసీసీ సభ్యులు ఒకసారి రోడ్డుపైకి వచ్చి ఎవరైనా సాధారణ ప్రేక్షకుడిని వీటి గురించి అడగమనండి. అప్పుడు వాస్తవికత తెలుస్తుందన్నాడు. టీ20ల కారణంగా టెస్టు, వన్డేలకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో క్రికెట్‌కు సరికొత్త ఉత్తేజం ఇవ్వాలనే లక్ష్యంతో ఐసీసీ ‘సూపర్ లీగ్’ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మొదట్లోనే సూపర్ లీగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా ఐసీసీ వెనక్కి తగ్గింది. ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్ ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌కు మారడంతో మళ్లీ సుపర్ లీగ్‌ను తెరపైకి తెచ్చింది. ఈ లీగ్‌పై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మండిపడుతున్నారు. ‘రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లను టెస్టు చాంపియన్ షిప్, సూపర్ లీగ్‌లకు ముడిపెట్టడం ఏమిటి? రెండింటినీ మిక్స్ చేయడం వల్ల గందరగోళం ఏర్పడుతున్నది. అభిమానులకూ ఏమీ అర్థం కావడం లేదు’ అని అథర్టన్ స్కై స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.