- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టిన భారత కెప్టెన్ మిథాలీ
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అదరగొట్టింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న మిథాలీ రాజ్ 5వ ర్యాంకుకు చేరుకున్నది. ఇంగ్లాండ్‌తో బ్రిస్టల్‌లో జరిగిన తొలి వన్డేలో 72 పరుగులతో మిథాలీ ఆకట్టుకున్నది. దీంతో ఆమె రేటింగ్ పాయింట్లు 725కి చేరుకున్నాయి. ఆ వన్డేతో మిథాలీ 22వ ఏళ్ల కెరీర్ కూడా పూర్తి చేసుకోవడం విశేషం. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఆమె టాప్ 5లోకి చేరుకోవడం విశేషం. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ బ్యూమౌంట్ 26 పాయింట్లు మెరుగుపరుచుకొని అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన లిజ్లీ లీ, మూడో స్థానంలో ఆసీస్ క్రికెటర్ అలీసా హీలె, నాలుగో స్థానంలో స్టెఫానీ టేలర్ కొనసాగుతున్నారు. బౌలర్లలో జులన్ గోస్వామి ఐదో స్థానంలో కొనసాగుతుండగా ఆసీస్‌కు చెందిన జెస్ జోనాసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.