ICC టెస్ట్ ప్లేయర్ అవార్డు 2021: నామినేషన్స్ జాబితా విడుదల

by Shyam |
ICC టెస్ట్ ప్లేయర్ అవార్డు 2021: నామినేషన్స్ జాబితా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ప్లేయర్ అవార్డ్ 2021‌కు నామినేషన్స్ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది 2021 అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నలుగురి ప్లేయర్స్‌ను నామినేట్ చేసింది. ఈ నామినేట్ జాబితాను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. భారత్ నుంచి ఒక్కడే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు నుంచి కెప్టెన్ జోరూట్, టీమిండియా ఆల్‌రౌండర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్, శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే ఈ అవార్డుల నామినేట్ రేసులో నిలిచారు.

ఈ ఇయర్ 15 టెస్టు మ్యాచ్‌లు ఆడిర జో రూట్ 61 సగటుతో 29 ఇన్నింగ్స్‌లో 1,708 పరుగులు చేశాడు. 2021 ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ జో రూట్‌దే. భారత ఆల్‌రౌండర్ రవి చంద్రన్ అశ్విన్ 16.23 సగటుతో 52 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. బ్యాటింగ్‌లో 28.08 సగటుతో 337 పరుగులు చేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కీవిస్ విజయం సాధించడంలో కైల్ జెమీసన్ కీలకమైన పాత్ర ఉంది. 2021 ఇయర్ 5 మ్యాచ్‌లో 17.51 సగటుతో 27 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్‌లోను 17.50 సగటుతో 105 పరుగులు చేశాడు.

Advertisement

Next Story