- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలంకలో ఆసియా కప్?
దిశ, స్పోర్ట్స్: ఒకవైపు టీ20 వరల్డ్‌కప్ సందిగ్ధంలో ఉండగానే మరో మెగా టోర్నీపై చర్చలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీని నిర్వహించాల్సి ఉంది. అయితే, భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లి ఆడటానికి నిరాకరించడంతో వేదిక మారుస్తామని కూడా దాయాది దేశం చెప్పింది. కానీ, యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు ఇండియా మొగ్గు చూపుతుండటంతో అక్కడ ఆసియాకప్ ఆడేందుకు ఇష్టపడటం లేదు. ఈసారి శ్రీలంకలో జరపడానికి పాక్ క్రికెట్ బోర్డు సుముఖత వ్యక్తం చేసినట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సిల్వా తెలిపారు. శ్రీలంకలో నిర్వహిస్తే తమ జట్టు ఆడుతుందని బీసీసీఐ కూడా చెప్పినట్టు సమాచారం. ఆసియాకప్ జరగకపోయినా భారత్ ఆడకపోయినా భారీ నష్టం వస్తుందని గ్రహించి పాక్ ఒప్పుకున్నట్టు తెలుస్తున్నది. కాగా, సిల్వా ప్రకటించినా దీనిపై అధికారిక నిర్ణయం మాత్రం జరగలేదు. ఐసీసీ సమావేశం తర్వాత ఆసియా కప్ షెడ్యూల్ అధికారికంగా ప్రకటించనున్నారు.