డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక సౌతాంప్టన్ : ఐసీసీ

by Shiva |
డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక సౌతాంప్టన్ : ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వేదికగా సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ మైదానాన్ని నిర్ణయించినట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. జూన్ 18 నుంచి 22 వరకు ఇండియా, న్యూజీలాండ్ మధ్య ఫైనల్ జరుగనున్నది. జూన్ 23ను రిజర్వ్ డేగా ప్రకటించారు. కాగా, ఇంతకు ముందు లండన్‌లోని లార్డ్స్‌ను ఫైనల్ వేదికగా నిర్ణయించారు. కానీ కరోనా నేపథ్యంలో సౌతాంప్టన్‌ను ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఏజెస్ బౌల్‌ను ఆనుకొనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండటంతో.. అక్కడ బయోబబుల్ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం సులభమని ఐసీసీ చెప్పింది.

Advertisement

Next Story