- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ ఎన్నికల్లో ప్రతిష్టంభన
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన తొలి రౌండ్ పోలింగ్ తర్వాత ప్రతిష్టంభన నెలకొన్నది. ఐసీసీ తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, న్యూజీలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్ల్కే ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో తొలి రౌండ్ పోలింగ్ నిర్వహించగా ఇరువురికీ సరిపడా ఓట్లు రాలేదు. మరో రెండు రౌండ్ల పోలింగ్ మిగిలి ఉన్నది. ఐసీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ అభ్యర్థికి మొత్తం ఓట్లలో మూడింట రెండు వంతుల ఓట్లు రావాలి.
ఐసీసీ శాశ్వత సభ్య దేశాలకు 12, అసోసియేట్ దేశాలకు మూడు, చైర్మన్, ఇంద్రనూయికి చెరో ఒక ఓటు ఉండగా మొత్తం 17 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో తాత్కలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు రెండు ఓట్లు వస్తాయి. కానీ ఆయన కేవలం అసోసియేట్ దేశాల తరపున ఒక ఓటు వేయడానికి మాత్రమే అర్హుడు. దీంతో మొత్తం ఓట్ల సంఖ్య 16కి తగ్గింది. దీని ప్రకారం ఎవరికైతే 11 ఓట్లు వస్తాయో వారు కొత్త చైర్మన్‌గా ఎన్నికవుతారు. బీసీసీఐ తమ తరపున అభ్యర్థులను ఎవరినీ నిలబెట్టలేదు.
కానీ, న్యూజీలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్ల్కేకు మద్దతు ఇస్తున్నది. చైర్మన్ ఎన్నికల్లో ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, మలేసియా దేశాలు ఒకవైపు ఉండగా.. పాకిస్తాన్ , జింబాబ్వే, శ్రీలంక, సింగపూర్ దేశాలు మరోవైపుఉన్నాయి. తొలి రౌండ్‌లో ఫలితం తేలకపోవడంతో మరో రెండు రౌండ్ల పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 2లోపు ఐసీసీకి కొత్త చైర్మన్ వచ్చే అవకాశం ఉన్నది.