- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
WTC ఫైనల్ మ్యాచ్ అఫీషియల్స్ వీళ్లే
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో ఇండియా, న్యూజీలాండ్ మధ్య జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫీషియల్స్‌ను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లోని రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మైఖెల్ గాఫ్‌ను ఫీల్డ్ అంపైర్లుగా, రిచర్డ్ కెటిల్‌బరోను టీవీ అంపైర్‌గా, అలెక్స్ వార్ఫ్‌ను ఫోర్ట్ అంపైర్‌గా నియమించారు. ఇక క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ఐసీసీ అంపైర్, రిఫరీల విభాగం సీనియర్ మేనేజర్ అడ్రైన్ గ్రిఫిత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అనుభవం కలిగిన ఎలైట్ ప్యానల్ అంపైర్లను నియమిస్తున్నాము. వారందరూ అందుబాటులో ఉండటం నిజంగా సంతోషం. ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లోని కీలక అంపైర్లు ఈ మ్యాచ్ బాధ్యతలు చూస్తారు’ అని గ్రిఫిత్ పేర్కొన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరోను డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు నియమించవద్దని ఐసీసీని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. అతడు కనుక అంపైరింగ్ చేస్తే టీమ్ ఇండియాకు కలసి రాదని గత రికార్డులు చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కెటిల్‌బరో వైరల్ అయ్యారు. అయినా ఐసీసీ వారి రిక్వెస్ట్‌లను లైట్ తీసుకొని తన పని తాను చేసుకొని పోయింది.