- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నవజాత శిశువుతో విధి నిర్వహణ
దిశ, వెబ్డెస్క్:
తన డ్యూటీ పట్ల అంకితభావంతో, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల్లోనే విధుల్లో చేరారు ఐఏఎస్ సౌమ్యా పాండే. ఘజియాబాద్ జిల్లాలో ఉన్న మోదీనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సౌమ్య పాండే తిరిగి విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా సౌమ్య పాండే మాట్లాడుతూ.. నేను ఒక ఐఏఎస్ అధికారిని కాబట్టి నా సేవను నేను చూసుకోవాలి. పిల్లల్ని జన్మనిచ్చే శక్తి, వారి బాగోగులు చూసుకునే శక్తి దేవుడు మహిళలకు ఇచ్చారని అన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్లు డెలీవరీ అవ్వగానే వారి జీవనోపాధి పనులు చేస్తుంటారని.. అలాగే చిన్నారులను కూడా చూసుకుంటారని తెలిపారు.
తన మూడు వారాల కూతురితో విధులు నిర్వర్తించడం దేవుడి దీవెనగా భావిస్తానని సౌమ్య తెలిపారు. తన కుటుంబం కూడా సపోర్టు ఇచ్చినట్లు చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, అధికారులు తనకు మద్దతిచ్చారని అన్నారు. ఘజియాబాద్ జిల్లాలో నోడల్ ఆఫీసర్‌గా పనిచేశానని, డెలివరీ కోసం సెప్టెంబర్‌లో 22 రోజుల పాటు లీవ్ తీసుకున్నానని, ప్రసవమైన రెండు వారాల తర్వాత మళ్లీ విధుల్లో చేరినట్లు స్పష్టం చేశారు.
Must be inspired by @GummallaSrijana ! @IASassociation Soumya Pandey (SDM Modinagar) didnt availed 06 months maternity leave, joined back office with her infant daughter. #CoronaWarriors pic.twitter.com/8Q6Cju2X49
— Dr.Prashanth (@prashantchiguru) October 12, 2020