‘బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం పదవికి నేను రెడీ’

by Shamantha N |   ( Updated:2021-02-19 12:05:38.0  )
‘బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం పదవికి నేను రెడీ’
X

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎంగా వ్యవహరించడానికి తాను సిద్ధమేనని మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తుందని, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుందని వివరించారు. త్వరలో బీజేపీలో చేరబోతున్న ఈ శ్రీధరన్ దేశంలో అసమ్మతి లేదని, అదంతా కేవలం చర్చల్లో కనిపించేవేనని కొట్టిపారేశారు.

నూతన సాగు చట్టాలను సమర్థిస్తూ రైతుల ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక శక్తులు నడిపిస్తున్నాయని ఆరోపించారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంటూనే విదేశీ సంస్థలతో చేతులు కలిపి కేంద్రానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఆ హక్కునూ నియంత్రించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story