చైనా దాచిపెట్టిన రహస్యాలు నేను చెబుతా

by vinod kumar |
చైనా దాచిపెట్టిన రహస్యాలు నేను చెబుతా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విషయమై చైనా వైరాలిజిస్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. అంతేకాదు చైనా దాచిపెట్టిన నిజాలను తాను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నది. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా జనాబా దాని బారినపడ్డారు. అంతేకాదు.. చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఈ సమయంలో చైనాకు చెందిన వైరాలిజిస్ట్ లి-మెంగ్ యాన్ సంచలన విషయాలు వెల్లడించారు. బీజింగ్ కరోనా వైరస్ గురించి నిజం చెప్పలేదని.. ఈ వైరస్ చైనాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రజలు అల్లాడిపోతున్నా కూడా ఆ విషయాన్ని చైనా చెప్పలేదని పేర్కొంది. చైనా నుండి తనకు ప్రాణహాని ఉందని, తనను అమెరికా కాపాడలని కోరింది. అయితే.. చైనా నుండి హాంకాంగ్ కు పారిపోయిన తర్వాత ఈ సంచలన విషయాలు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed