- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బాధ నాకు తెలుసు.. నేనూ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించా : గంగూలీ
దిశ, స్పోర్ట్స్: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై వస్తున్న విమర్శలు ఇంకా ఆగడం లేదు. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఉండటంతో అతడినే లక్ష్యంగా చేసుకొని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో గంగూలీ మరోసారి అసలు ఏం జరిగిందో వివరించాడు.
‘నేను ఇప్పటికీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని చెప్పినప్పుడే వ్యక్తిగతంగా కోహ్లీతో మాట్లాడాను. ఆ నిర్ణయాన్ని విరమించుకోమని సూచించాను. అయితే చాలా రోజులుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ భారంగా భావించాడు. నేను కూడా కెప్టెన్‌గా పని చేశాను. ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అయితే కోహ్లీ ఇకపై అంతటి భారాన్ని మోయలేనని భావించాడు. అదే సమయంలో సెలెక్టర్లు వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అనవసరం అనుకున్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ ఒక అద్భుతమైన బ్యాటర్. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. టీమ్ ఇండియా ఒక అద్భుతమైన జట్టు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలియదు. కానీ జట్టులో ఉన్న ప్రతిభావంతులు ఏ లోటూ రానీయకుండ నడిపిస్తారని ఆశిస్తున్నాను’ అని గంగూలీ పేర్కొన్నాడు.