‘కోహ్లీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా’

by Shyam |
‘కోహ్లీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా’
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను జీవితాంతం రుణపడి ఉంటానని క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. తాను తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు, క్రికెట్ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కోహ్లీనే అండగా ఉన్నాడని చెప్పాడు. ఆస్ట్రేలియాలో తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు తనను కౌగిలించుకొని ఒక అన్నలా ఓదార్చాడని చెప్పాడు. ‘నీకు ఏ వికెట్ పైన అయినా చక్కగా బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్నది. నీవు కరెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చెయ్యి. అప్పుడు ఎలాంటి బ్యాట్స్‌మాన్ అయినా పెవీలియన్ చేరాల్సిందే’ అని నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నా క్రికెట్ జీవితంలోని ప్రతీ దశలో కోహ్లీ భయ్యా అండగా ఉన్నాడు. నీ కోసం నేను ఉన్నాను.. భయపడకు అని అభియమిచ్చాడని సిరాజ్ ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story