పంత్ ఆట తీరు నాకు పిచ్చెక్కిస్తుంది : సౌరవ్ గంగూలీ

by Shiva |
పంత్ ఆట తీరు నాకు పిచ్చెక్కిస్తుంది : సౌరవ్ గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ఆటతీరు తనకు పిచ్చెక్కిస్తుందని.. అతడు ఒక గొప్ప మ్యాచ్ విన్నర్ అని మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇక కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు ఎంతో ఆస్వాదిస్తానని.. మహ్మద్ షమీ, బుమ్రాల బౌలింగ్ చాలా బాగుంటుందని గంగూలీ ప్రశంసించాడు. వాస్తవంగా బీసీసీఐకి అధ్యక్షుడిగా ఉంటూ ఏ ఆటగాడు ఇష్టమో చెప్పకూడదు.. కానీ నా మనసులో మాటను వెల్లడించకుండా ఉండలేక పోయానని అన్నాడు. క్లాస్ ఫస్ట్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ‘గవాస్కర్ రిటైర్ అయ్యాక టీమ్ ఇండియా ఏమైపోతుందో అనుకంటే సచిన్, ద్రవిడ్, కుంబ్లే వంటి క్రికెట్లు వచ్చారు. వాళ్ల కెరీర్ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్, పంత్ వంటి ఆటగాళ్లు ఆ రిథమ్ అందుకున్నారు. మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వచ్చే తరంలో మరింత మంది అద్భుతమైన ఆటగాళ్లు రానున్నారు’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story