నేను గొడ్డుమాంసం తింటా.. అలా చెప్పే ధైర్యం మీకుందా?

by Anukaran |   ( Updated:2020-12-29 21:24:11.0  )
నేను గొడ్డుమాంసం తింటా.. అలా చెప్పే ధైర్యం మీకుందా?
X

దిశ,వెబ్ డెస్క్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలువురు పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలపై పార్టీ నేతలు ధైర్యంగా మాట్లాడాలని అన్నారు. అంతేకాదు గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో తాను బీఫ్ తింటానంటూ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.

మీకు గుర్తుందో లేదో అసెంబ్లీ సమావేశాల్లో నాకు బీఫ్ అంటే ఇష్టమని, తింటానని ధైర్యంగా చెప్పారు. విమర్శించిన వారిని మీరెవరూ నన్ను అడగడానికి అని ప్రశ్నించాను . నా ఫుడ్ హ్యాబిట్ నా ఇష్టం. మీకు బీఫ్ తినడం ఇష్టం లేకపోతే మానేయ్యండి. నాకు ఇష్టం కాబట్టి నేను తింటాను. ఇలా మీరు కూడా నాలాగా మాట్లాడగలరా ‘ అంటూ సవాల్ విసిరారు.

మీరు మౌనంగా ఉండి ఇతరులు మాట్లాడే మాటలు నిజమనేంతలా చేస్తున్నారని, అలా మౌనంగా ఉండడం సరికాదన్నారు. మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి భయటపడండి అంటూ.. కర్ణాటక బీజేపీ మంత్రి వర్గం రాష్ట్రంలో గోవధ వ్యతిరేకిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా సిద్ధ రామయ్య పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed