- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హార్ట్ ఎటాక్ రాలేదు.. రెగ్యులర్ చెకప్‌కు వెళ్లా: ఇంజమామ్
దిశ, స్పోర్ట్స్: పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ సోమవారం గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరగా… అతడికి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. మూడు రోజులుగా ఛాతి నొప్పితో బాధపడుతున్న ఇంజమామ్‌కు సోమవారం తీవ్రంగా నొప్పి రావడంతో లాహోర్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తనకు ఎలాంటి గుండెనొప్పి రాలేదని ఇంజమామ్ ఒక యూట్యూబ్ వీడియోలో స్పష్టం చేశాడు.
‘నేను గుండెనొప్పితో బాధపడినట్లు.. వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు వార్తలు చదివాను. నాకు అసలు గుండె నొప్పే రాలేదు. యాంజియోప్లాస్టీ జరగలేదు. నేను రొటీన్ చెకప్‌లో భాగంగా డాక్టర్ వద్దకు వెళ్లాను. ఆ సమయంలో నాకు యాంజియోగ్రఫీ మాత్రమే చేశారు. నా గుండెలో ఒక ధమనిలో పూడిక ఉన్నట్లు గుర్తించారు. ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక స్టంట్ వేశారు. అంతేకానీ, గుండె నొప్పితో తాను ఆసుపత్రిలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో 12 గంటలు గడిపిన అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశాను’ అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.