- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్‌న్యూస్: ఉద్యోగుల కోసం హ్యూండాయ్ కీలక నిర్ణయం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా సెకెండ్ వేవ్ కరోనా నేపథ్యంలో తమ ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా సంస్థలోని ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులందరికీ కరోనా టీకా వేయిస్తున్నట్టు తెలిపింది. అంతేకాకుండా, దీనికి అదనంగా సంస్థలో పనిచేసే ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు కంపెనీ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, బోనస్‌లు అందించనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అర్హత ఉన్నవారికి ప్రమోషన్, ఇతర వెసులుబాట్లను అమలు చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కంపెనీ కరోనా బారిన పడిన ఉద్యోగులకు చికిత్స కోసం వేతన సెలవులను కూడా అందిస్తోందని తెలిపింది. ‘కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. కంపెనీ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కరోనా బారిన పడిన ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల మద్దతును ఇస్తున్నామని’ కంపెనీ వైస్-ప్రెసిడెంట్ స్టిఫెన్ సుధాకర్ వెల్లడించారు.