'కార్ ఆఫ్ ది ఇయర్‌'గా హ్యూండాయ్ ఐ20

by Harish |   ( Updated:2021-03-01 10:57:36.0  )
కార్ ఆఫ్ ది ఇయర్‌గా హ్యూండాయ్ ఐ20
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ నుంచి వచ్చిన సరికొత్త హ్యూండాయ్ ఐ20-2021 మోడల్ ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు కోసం తొమ్మిది కార్లు పోటీపడగా థర్డ్ జెనరేషన్ హ్యాచ్‌బ్యాక్‌గా ఐ20 మోడల్ దీన్ని సాధించుకుంది. గతేడాది చివర్లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మహీంద్రా థార్, కియా సొనెట్ లాంటి కార్లను సైతం అధిగమించింది.

ఇక, ప్రీమియం కార్ల విభాగంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రీమియర్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఈ జాబితాలో మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ రెండో స్థానంలోనూ, బీఎండబ్ల్యూ 2 సిరీస్ మూడో స్థానంలో ఉంది. ఇక, ఎలక్ట్రికల్ విభాగంలో టాటా నెక్సాన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, తర్వాతి స్థానాల్లో హ్యూండాయ్ కొనా, ఎంజీ జెడ్ఎస్ నిలిచాయి. టాటా నెక్సాల్ కారు గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.

Advertisement

Next Story