కార్ల కొనుగోలు అప్పుడైతేనే కరెక్ట్ అంటున్న కంపెనీలు..

by Harish |
honda
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలించిన తర్వాత వాహన మార్కెట్ పరిస్థితి మెరుగుపడుతోందని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యూండా, హోండా అభిప్రాయపడ్డాయి. ఈ పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాలకు డిమాండ్ బలంగా ఉంటుందని ఇరు కంపెనీలు ఆశిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల తర్వాత చాలామంది వ్యక్తిగత వాహనాలను కొనాలని భావిస్తున్నారని, దీంతో పండుగ సీజన్‌పై ఆటో కంపెనీలు ఎన్నో అంచనాలతో ఉన్నాయి. ప్రస్తుతం సెమీకండక్టర్ల కొరతతో పాటు కొవిడ్ మూడో వేవ్, సరఫరా వంటి కీలకమైన సవాళ్లు దేశీయ ఆటో పరిశ్రమ ముందున్నాయి. ఇవి వాహన రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని కంపెనీలు పేర్కొన్నాయి.

‘డిమాండ్ చాలా బలంగా ఉంది. వ్యక్తిగత వాహనాల కొనుగోలులో మార్పులను గమనిస్తున్నాము. పండుగ సీజన్ దీనికి అనువైన సమయమని భావిస్తున్నట్టు’ హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ అన్నారు. కొవిడ్ సెకెండ్ వేవ్ ఆంక్షలు క్రమంగా తొలిగాయి. వినియోగదారుల సెంటిమెంట్ మెరుగ్గా ఉందనే నమ్మకం ఉంది. గత కొన్ని నెలలుగా పరిశ్రమ రికవరీ వేగంగా ఉంది. ఇది పండుగ సీజన్ సమయానికి వేగవంతమైన సానుకూలతను చూడగలమని హోండా కార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాజేష్ గోయెల్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed